నానితో పాటు మరో ఇద్దరు!

న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న ‘హిట్-3’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు శైలేష్ కొలను హిట్ ఫ్రాంచైజీలో మూడో భాగంగా తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో అర్జున్ సర్కార్ అనే పవర్‌ఫుల్ పాత్రలో నాని తనదైన పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నాడు.

ఈ సినిమాను వేసవి కానుకగా విడుదల చేయడానికి  సినిమా బృందం రెడీ అవుతుంది.. అయితే, ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో నానితో పాటు మరో ఇద్దరు యంగ్ హీరోలు కనిపిస్తారని తెలుస్తోంది. హిట్ తొలి భాగంలో నటించిన విశ్వక్ సేన్, హిట్-2 హీరో అడివి శేష్ ఇప్పుడు హిట్-3లో కేమియో పాత్రల్లో కనిపిస్తారని తెలుస్తోంది.

దీంతో హిట్-3 మూవీలో వారి ఎంట్రీ ఎప్పుడెప్పుడు ఉంటుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో అందాల భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories