ఆ వివరాలు ఏంటంటే!

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లైలా’ ఫిబ్రవరి 14న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు రామ్ నారాయణ్ డైరెక్ట్ చేయగా పూర్తి రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతుంది. 

ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేశాయి. కాగా, ఈ సినిమా సెన్సార్ పనులు కూడా ముగించుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ‘ఏ’ సర్టిఫికెట్ జారీ చేసింది. ఇందులో బోల్డ్ డైలాగ్స్, కొన్ని సీన్స్ కారణంగా ఈ సినిమాకి ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. ఇక ఈ సినిమా రన్‌టైమ్‌ను 2 గంటల 16 నిమిషాలుగా ఖరారు చేశారు మేకర్స్. 

క్రిస్పీ రన్‌టైమ్‌తో రానున్న ఈ సినిమా యూత్ ఆడియన్స్‌ను ఆకట్టుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక ఈ సినిమాలో విశ్వక్ సేన్ తొలిసారి లేడీ గెటప్‌లో నటిస్తున్నాడు. అందాల భామ ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తుండగా షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories