తరువాత సినిమా ఏంటంటే!

తరువాత సినిమా ఏంటంటే! మాస్ మహారాజ రవితేజ హీరోగా ఇపుడు చేస్తున్న తాజా సినిమా “మాస్ జాతర”. తన హిట్ హీరోయిన్ శ్రీలీలతో మరోసారి దర్శకుడు భాను భోగవరపు తెరకెక్కించిన ఈ సాలిడ్ మూవీ విడుదల కోసం మాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఫుల్ స్వింగ్ లో సినిమాలు కంప్లీట్ చేసే రవితేజ ఇపుడు తన లైనప్ లో ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ని ఓకే చేసినట్లుగా తెలుస్తుంది. యంగ్ హీరోస్ తో మంచి సెన్సిబుల్ సినిమాలు అందించిన దర్శకుడు కిషోర్ తిరుమలకి ఇపుడు రవితేజ ఓకే చెప్పినట్టుగా తెలుస్తుంది. నేను శైలజ, చిత్ర లహరి లాంటి సూపర్ హిట్స్ ఎన్నో ఇచ్చిన ఈ దర్శకుడు రవితేజ గురించి ఇంట్రెస్టింగ్ సబ్జెక్టుని రెడీ చేయగా అది మాస్ మహారాజ్ ఓకే చేసేయడం కూడా జరిగింది అన్నట్టు తెలుస్తుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories