ఆ డైరెక్టర్‌ ప్రశంసల గురించి చైతూ ఏమన్నాడంటే!

ఆ డైరెక్టర్‌ ప్రశంసల గురించి చైతూ ఏమన్నాడంటే! యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి కాంబోలో వచ్చిన మూవీ ‘తండేల్’. చందూ మొండేటి డైరెక్షన్‌ లో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రాన్ని వీక్షించిన సీనియర్ ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు సినిమాపై తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఎక్స్‌ వేదికగా పెట్టిన పోస్ట్‌ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ‘చాలా రోజులకు తండేల్ వంటి అద్భుతమైన ప్రేమ కథ చూశాను. నాగ చైతన్య, సాయి పల్లవి పోటీ పడి నటించారు. చందూ మొండేటి తీసుకున్న కథ.. దాని నేపథ్యం సాహసోపేతమే. షాట్ మేకింగ్‌పై దర్శకుడి శ్రద్ధ బాగుంది. ఈ చిత్రంతో విజయాన్ని అందుకున్న గీతా ఆర్ట్స్‌కు అభినందనలు. ఒక్క మాటలో ఇది ఒక దర్శకుడి సినిమా..!’’ అని రాఘవేంద్రరావు రాసుకొచ్చారు. సీనియర్‌ దర్శకుడు రాఘవేంద్రరావు నుంచి ప్రశంసలు రావడంపై హీరో నాగచైతన్య ఆనందం వ్యక్తం చేస్తూ రిప్లై ఇచ్చారు. ‘‘థాంక్యూ సో మచ్‌ సర్‌. మీ మాటలు నాకెంతో విలువైనవి. మీకు మా సినిమా నచ్చినందుకు సంతోషం’’ అని చైతు తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

Related Posts

Comments

spot_img

Recent Stories