దస్తగిరి కేసు విచారణతో అవినాష్ రెడ్డిలో గుబులు!

వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవరు మారిన దస్తగిరి తాజాగా పెట్టిన కేసు విచారణ ముమ్మారంగా సాగుతూ ఉండడం ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి గుబులు పుట్టిస్తోంది. కడప సెంట్రల్ జైల్లో జరిగిన అరాచక వ్యవహారాల  నిగ్గుతేల్చేందుకు రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ విచారణ అధికారిగా ఈ పర్వం సాగుతోంది. దస్తగిరిని ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించినట్లుగా, చంపుతామని బెదిరించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ చైతన్య రెడ్డిని విచారించడం ఇప్పటికే పూర్తయింది. అదే అప్పట్లో కడప సెంట్రల్ జైలు సూపపరింటెండెంటు  ప్రకాష్ ను విచారిస్తున్నారు. రెండు రోజులుగా విచారణ పర్వం ముమ్మరంగా సాగుతుంది. విచారణ వేగం అవుతున్న కొద్దీ ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డికి గుబులు పెరుగుతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

వైఎష్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అసలు నిందితుడు, సూత్రధారి అవినాష్ రెడ్డి మాత్రమేనని.. తన రాజకీయ ప్రస్థానానికి అడ్డు తొలగించుకునే ఉద్దేశంతో మాత్రమే వివేకాను హత్య చేయించారని.. సీబీఐ ఇప్పటికే కోర్టుకు నివేదించిన సంగతి తెలిసిందే! అవినాష్ రెడ్డి మాత్రం బెయిలుపై బయట తిరుగుతున్నారు. దస్తగిరి అప్రూవర్ గా మారిన తర్వాత ఈ కేసు చిక్కుముడి చాలా సులువుగా విడిపోయినట్లుగా భావించాలి. అందుకే దస్తగిరిని ప్రలోభ పెట్టి ఫిరాయించేలా చేస్తే కనుక తన మీద కేసు వీగిపోతుందనేది వారి ఆశ. అందుకే మరొక కేసులో దస్తగిరి జైలులో ఉన్న సమయంలో చాలా వ్యూహాత్మకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరించింది. వైఎస్ అవినాష్ రెడ్డి తరఫున మనుషుల్లో ఎవరు కడప సెంట్రల్ జైలుకు వెళ్లినా సరే ప్రజలలో అనుమానాలు వస్తాయని భయపడ్డారు. అందుకే మెడికల్ క్యాంపు పేరుతో ఒక డ్రామా నిర్వహించారు. హత్య కేసులో కీలక నిందితుడు శివశంకర్ రెడ్డి కొడుకు డాక్టర్ చైతన్య రెడ్డిని ఆ మెడికల్ క్యాంపు నిర్వహించేలా ఏర్పాటు చేశారు.

ఈ నెపం మీద జైలులోని బ్యారెక్ లకు వెళ్లిన చైతన్య రెడ్డి.. దస్తగిరిని మాత్రం వైఎస్ అవినాష్ రెడ్డి కుటుంబానికి వ్యతిరేకంగా ఏమీ మాట్లాడకుండా ఉంటే 20 కోట్లు ఇస్తామని ఆఫర్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. ఒకవేళ అతను మాట వినకపోతే జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత నరికి చంపుతామని బెదిరించినట్లుగా కూడా దస్తగిరి అంటున్నారు. అతని ఫిర్యాదులపై అప్పట్లో అసలు కేసులే నమోదు కాకపోగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విచారణ ముమ్మరం చేసింది.

20 కోట్ల ఆఫర్ ఎవరిచ్చారు? మీరు ఆఫర్ ఇవ్వడం వెనుక మీ తెరవెనుక నుంచి నడిపించినది ఎవరు? అనే ప్రశ్నలతో డాక్టర్ చైతన్య రెడ్డిని ఉక్కిరిబిక్కిరి చేసినట్లుగా తెలుస్తుంది. సూపరింటెండెంటును ప్రకాశ్ ను  కూడా విచారించడంలో.. క్యాంపు ఏర్పాటు చేసిన వ్యవహారాలు, చైతన్య రెడ్డి వచ్చి వెళ్లిన తరువాత దస్తగిరి మీద ఒత్తిడి తీసుకొచ్చిన వ్యవహారాల గురించి ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ఈ కేసు విచారణ పూర్తయితే.. తన పాత్ర మరింత స్పష్టంగా బయటకు వస్తుందని అవినాశ్ రెడ్డి ఆందోళన చెందుతున్నారు. కడపలో జడ్పీ సమావేశానికి హాజరైన అవినాష్ దస్తగిరి కేసు విచారణ గురించి ఎక్కువ ఆందోళన ఉన్నట్టుగా కనిపించారని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories