ఆ యంగ్ హీరో ఎవరో తెలుసా! నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్ మూవీస్ డైరెక్టర్ బోయపాటి కాంబోలో వచ్చిన ‘అఖండ’ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రానికి సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టిన ‘అఖండ 2 – తాండవం’ చిత్రం ప్రస్తుతం కొన్ని కీలక యాక్షన్ సన్నివేశాలు రూపొందిస్తుంది. అయితే, ఈసారి ‘అఖండ 2’ లో బోలెడన్ని సర్‌ప్రైజ్‌లు ప్లాన్ చేశాడు బోయపాటి.
ఇప్పటికే యంగ్ బ్యూటీ సంయుక్త మీనన్ ఈ మూవీలో హీరోయిన్‌గా నటించనున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ సినిమాలో మరో యంగ్ హీరో, విలక్షణ యాక్టర్ ఆది పినిశెట్టి కూడా యాక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా జరుగుతున్న ‘అఖండ 2’ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్‌లో ఆది పినిశెట్టి కూడా జాయిన్ అయ్యాడంట. ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ నేతృత్వంలో తెరకెక్కుతున్న ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌లో ఆది కూడా కనిపిస్తాడని సమాచారం.
ఇక ‘అఖండ 2’ మూవీని బోయపాటి శ్రీను అత్యంత ప్రెస్టీజియస్ మూవీగా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు థమన్ మరోసారి హై వోల్టేజ్ మ్యూజిక్ అందించనుండగా ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ప్రొడ్యూస్ చేస్తున్నారు.