దీనికి కూడానా!

టాలీవుడ్‌లో సినిమాలు విడుదల కావడం, ప్రేక్షకులు వాటికి తగ్గట్టుగా తీర్పును ఇవ్వడం మనం చూస్తూనే ఉంటాం. అయితే, భారీ చిత్రాలకు పైరసీ భూతం బెడద ఎప్పటినుంచో పెద్ద సమస్యగా మారింది. కానీ, ఇటీవల ఈ పైరసీ భూతం టాలీవుడ్ వర్గాలకు పెద్ద తలనొప్పిగా తయారైంది. విడుదల రోజునే హెచ్‌డీ ప్రింట్ సినిమాలను ఆన్‌లైన్‌లో పెట్టేస్తున్నారు పైరసీ కేటుగాళ్లు.

ఇటీవల ‘గేమ్ ఛేంజర్’ మూవీ కూడా ఈ సమస్య బారిన పడింది. విడుదల రోజునే హెచ్‌డీ ప్రింట్ ఆన్‌లైన్‌లో ప్రత్యక్షం కావడం ఆ సినిమాకు భారీ నష్టం కలిగించింది. దీంతో ఆ చిత్ర మేకర్స్ దాని వెనకాల ఉన్న వ్యక్తులను పట్టుకునేందుకు ప్రయత్నించారు. కాగా, ఇప్పుడు తాజాగా విడుదలైన ‘తండేల్’ మూవీకి కూడా ఈ సమస్య ఎదురైంది.

విడుదలైన కొన్ని గంటల్లోనే హైక్వాలిటీ ప్రింట్ ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైంది.దీంతో తండేల్ మేకర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు సినిమాను ఇంత హై క్వాలిటీ ప్రింట్‌తో ఎలా ఆన్‌లైన్‌లో లీక్ చేస్తున్నారా అనేది మిలియన్ డాలర్ క్వశ్చన్‌గా మారింది.

Related Posts

Comments

spot_img

Recent Stories