రౌడీ హీరో కోసం పాన్‌ ఇండియా హీరోలు!

రౌడీ హీరో కోసం పాన్‌ ఇండియా హీరోలు! తెలుగు చిత్ర పరిశ్రమలో తెరకెక్కుతున్న భారీ సినిమాల్లో మోస్ట్‌ ప్రెస్టీజియస్ మూవీ రౌడీస్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా సినిమా VD12 కూడా ఒకటి. ఈ సినిమాను దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీపై అంచాలను నెక్స్ట్ లెవెల్‌కి చేరుకున్నాయి. 


ఇక ఈ సినిమా నుంచి ఎప్పుడెప్పుడా అని అందరూ ఎంతో ఆసక్తిగా చూస్తున్న క్రేజీ అప్డేట్‌కి మేకర్స్ టైమ్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. VD12 చిత్రానికి సంబంధించిన టైటిల్ టీజర్‌ను ఫిబ్రవరి 12న విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది. దీంతో ఈ టైటిల్ టీజర్ ఎలా ఉండబోతుందా.. ఇది ఎలాంటి సెన్సేషన్స్‌ క్రియేట్ చేస్తుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

అయితే, VD12 టైటిల్ టీజర్ కోసం పలువురు పాన్ ఇండియా హీరోలు తమ గొంతు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్ర హిందీ టైటిల్ టీజర్‌కు బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ వాయిస్ ఇచ్చాడని సమాచారం.తెలుగులో ఈ టైటిల్ టీజర్‌కు మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్ తన వాయిస్ ఇస్తాడని.. తమిళ్‌లో సూర్య లేదా ధనుష్‌లో ఒకరు తమ వాయిస్ ఇవ్వనున్నారని తెలుస్తుంది. ఇలా విభిన్న భాషల్లో పాన్ ఇండియా స్టార్స్‌తో వాయిస్ ఓవర్ చెప్పించడం చూస్తుంటే, ఈ టైటిల్ టీజర్‌కు ఎలాంటి క్రేజ్ దక్కనుందో అర్థమవుతోంది. 

Related Posts

Comments

spot_img

Recent Stories