పెద్దిరెడ్డి గుట్టు తేలనుంది.. దబాయింపు నడవదు!

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గత ప్రభుత్వ హయాంలో జగన్ ను మించి చెలరేగిపోయిన మంత్రిగా పేరు తెచ్చుకున్నారు. రాష్ట్రంలో ఏ కుంభకోణం జరిగినా, ఏ అవినీతి అరాచక వ్యవహారం జరిగినా దానిని తవ్వుకుంటూ పోతే.. చివరికి అది పెద్దిరెడ్డి దగ్గరే తేలుతుంది. ఇసుక అక్రమ తవ్వకాలతో గత ప్రభుత్వంలో వైసీపీ పెద్దలు వేలకు వేల కోట్లు కాజేసినా పెద్దిరెడ్డి స్వయంగా ఆ శాఖ మంత్రి.. అక్రమ లింకులన్నీ ఆయన బినామీ సంస్థలుగా వెలుగుచూశాయి. లిక్కర్ వ్యాపారంలో ఏకంగా డిస్టిలరీలను బెదిరించి ఏకంగా మూడువేల కోట్లరూపాయల స్వాహా చేశారంటే.. కీలక సూత్రధారి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అని తాజాగా సీఐడీ విచారణలో తేలింది. ఇలా అన్ని రకాల అక్రమాలకు ఆయన కేంద్రబిందువుగా వెలుగొందుతున్నారు. అలాంటి వివాదాస్పద మంత్రి చిత్తూరు జిల్లాలో.. అటవీ ప్రాంతంలో భూములను కాజేసిన వైనం పత్రికల ద్వారా వెలుగులోకి రావడంతో ఇప్పుడు అంతా నిగ్గు తేల్చడానికి అధికారులు రంగంలోకి దిగుతున్నారు.

అటవీ భూములను కబ్జా చేసిన వ్యవహారం తేల్చేందుకు జీపీఎస్ ద్వారా సిబ్బంది కొలతలు తీశారు. దానిపై అటవీ భూములు, ఇతర భూములు ఎంత మేర ఉన్నాయో లెక్క తేలుస్తారు. ఏకంగా చిత్తూరు కలెక్టరు సుమిత్ కుమార్, ఎస్పీ మణికంఠ, జేసీ విద్యాధరి, డీఎఫ్‌వో భరణి ఆధ్వర్యంలో అధికారులు ఈ పనులు చేస్తుండడం గమనార్హం.
అటవీ శాఖ మంత్రిగా కూడా ఉంటూ.. అటవీ భూములను కాజేసిన పెద్దిరెడ్డి తీరు గురించి.. పత్రికల్లో విపులమైన కథనాలు రావడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉలిక్కి పడింది. మామూలుగా అయితే జగన్మోహన్ రెడ్డిమీద విమర్శలు వస్తే.. ఆయన తరఫున వకాల్తా పుచ్చుకోవడానికి బోలెడు మంది పార్టీ నాయకులు ఉవ్విళ్లూరినట్టుగా… ఇప్పుడు పెద్దిరెడ్డి భూదందాల గురించిచ వార్తలు రావడడంతో.. చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర రెడ్డి నుంచి పలువురు నాయకులు ఆయనకు మద్దతుగా మాట్లాడ్డానికి ముందుకొచ్చారు. ఆయన భూములకు సంబంధించి అన్నీ చట్టబద్ధమైన పత్రాలున్నాయని, అటవీ భూములు కబ్జాచేసినట్టు తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని.. తాము న్యాయపోరాటంచేస్తామని హెచ్చరించారు.

వారి మేకపోతు గాంభీర్యపు మాటలకు ఎవ్వరూ జడవలేదు. పెద్దిరెడ్డి దందాలను ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకుంది. దీంతో ఆయన భూములపై విచారణ ప్రారంభం అయింది. సమగ్ర విచారణ కోసం రాష్ట్రప్రభుత్వం చిత్తూరు కలెక్టరు, ఎస్పీ, అనంతపురం సీఎఫ్ యశోదాబాయిలతో ఒక సంయుక్త కమిటీని కూడా ఏర్పాటు చేయడం విశేషం. పెద్దిరెడ్డి బాగోతాలు దాచితే దాగేవి కాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories