స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న తాజా సినిమా ‘జాక్’. ఈ సినిమాని డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తుండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమా నుంచి తాజాగా టీజర్‌ను సిద్ధు బర్త్‌డే ట్రీట్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు.
ఈ సినిమాలో జాక్ పాత్రలో సిద్ధు అందరినీ సర్‌ప్రైజ్ చేయనున్నాడంట. ఈ సినిమాలో ఆయన ఓ దొంగగా కనిపించనున్నాడని ఈ టీజర్ చూస్తే తెలిసిపోతుంది. ఇక జాక్ చేసే పనులు, చెప్పే మాటలు అందరినీ కన్ఫ్యూజ్ చేయడంతో పాటు కామెడీని పండించే విధంగా ఉన్నాయి. ఈ క్రమంలోనే అతడిని ప్రేమించే హీరోయిన్ పాత్రలో వైష్ణవి చైతన్య క్యూట్‌గా ఉంది.
ఈ చిత్రాన్ని బొమ్మరిల్లు భాస్కర్ ఓ పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దాడని ఈ టీజర్ చెబుతోంది.