లైలా కోసం విశ్వంభర!

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా భారీ సినిమా “విశ్వంభర” ని చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కొనసాగుతుండగా మరో పక్క మన టాలీవుడ్ నుంచి పలు సినిమాలు థియేటర్స్ లో అలరించేందుకు వస్తున్నాయి. మరి తాజాగా మాస్ కా దాస్ విశ్వక్ సేన్ యాక్ట్‌ చేస్తున్న మోస్ట్‌ అవైటెడ్ సినిమా “లైలా” కూడా ఇపుడు  ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ గా ఉన్న సంగతి తెలిసిందే.

ఈ వాలెంటైన్స్ డే కానుకగా మేకర్స్ ఈ చిత్రాన్ని తీసుకొస్తుండగా ఈ సినిమా కోసం ఇపుడు మెగాస్టార్ చిరంజీవిని చిత్ర నిర్మాతలు  తీసుకొస్తున్నారు. లాస్ట్ టైం జీబ్రా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కి వచ్చిన మెగాస్టార్ ఇపుడు లైలా కోసం రానున్నట్లు విశ్వక్ వివరించాడు. చిరంజీవిని కలిసి ఆహ్వానించిన పిక్స్ ఇపుడు వైరల్ అవుతున్నాయి.

తనతో పాటుగా నిర్మాత సాహు గారపాటి కూడా కలిసి చిరుని ఆహ్వానించారు. దీంతో ఈ ఫోటో మూమెంట్ వైరల్ గా మారింది.

Related Posts

Comments

spot_img

Recent Stories