రౌడీ హీరో ట్రీట్ కోసం అంతా వెయింటింగ్! టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న సాలిడ్ ప్రాజెక్ట్ గురించి అందరికీ తెలిసిందే. విజయ్ కెరీర్ లో 12వ సినిమా ఇది కాగా ఈ సినిమా నుంచి టైటిల్ సహా టీజర్ పై కూడా ఎప్పటి నుంచో మంచి బజ్ వినపడుతుంది.
కానీ ఇవి మాత్రం ఆలస్యం అవుతూనే వస్తున్నాయి. మరి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ వర్క్ కూడా ఆలస్యం అవుతుండడం ఒక కారణం అని సమాచారం. కానీ ఇపుడు ఫైనల్ గా ఈ ట్రీట్ కి రంగం సిద్ధం అయినట్లు సమాచారం. దీంతో ఈ కొద్ది సమయంలోనే ఈ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ పై సాలిడ్ అప్డేట్ రానున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతానికి “సామ్రాజ్యం” అనే పవర్ఫుల్ టైటిల్ లాక్ చేసినట్టు రూమర్స్ ఉన్నాయి. మరి చూడాలి ఇదే టైటిల్ ఉంటుందా లేక వేరేనా అనేది. ఇక ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ అలాగే ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.