వార్‌ 2 లో తారక్‌ పేరు ఇదే!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటించిన టాలీవుడ్‌ మూవీ “దేవర” సాలిడ్ హిట్ తర్వాత తన నుంచి రానున్న సినిమాల్లో డైరెక్టర్‌ అయాన్ ముఖర్జీతో చేస్తున్న భారీ యాక్షన్ సీక్వెల్ మూవీ “వార్ 2” కూడా ఒకటి. మరి ఎన్నో అంచనాలు ఉన్న ఈ సినిమాలో బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ తో తాను నటిస్తున్నాడు.

అయితే ఈ సినిమాలో తారక్ మంచి పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. అలాగే హృతిక్ తో పలు ఎనర్జిటిక్ యాక్షన్, డాన్స్ సీక్వెన్స్ లు కూడా ఉన్నాయి. అయితే ఇపుడు తారక్ పేరు ఈ సినిమా నుంచి టాక్‌ బయటకు వచ్చింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ వీరేంద్ర రఘునాథ్ అనే పేరుతో పిలవడం జరుగుతుందని తెలుస్తుంది.

మొత్తానికి మాత్రం పవర్ఫుల్ నటుడికి మంచి స్క్రీన్ నేమ్ పడినట్టే అని చెప్పవచ్చు.

Related Posts

Comments

spot_img

Recent Stories