దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన భారీ మల్టీ స్టారర్ సినిమా “రౌద్రం రణం రుధిరం” సినిమాతో హీరోలు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అలాగే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వరల్డ్ వైడ్ ఎలాంటి క్రేజ్ తెచ్చుకున్నారో అందరికీ తెలిసిన విషయమే.అయితే ఓటిటిలో వచ్చాక RRR హవా అలా కొన్నాళ్ల పాటు ఓ రేంజ్ లో నడిచింది.
మరి తాజాగా మరోసారి RRR నాటు నాటు అలాగే ఎన్టీఆర్ ల పేర్లు వైరల్ అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తం గా అత్యధికంగా పాపులారిటీ ఉన్న స్పోర్ట్స్ ఏదన్నా ఉంది అంటే అది ఫుట్ బాల్ అనే చెప్పాలి. మరి వరల్డ్ వైడ్ గా ఫిఫా గురించి తెలియని వారు కూడా ఉండరు. మరి ఇన్స్టాగ్రామ్ లో వారి హ్యాండిల్ నుంచి ఫేమస్ ప్లేయర్స్ నెయ్ మార్, టెవెజ్ అలాగే రోనాల్డో లకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ నాటు నాటు స్టెప్ స్టిల్ తో NTR అని ముగ్గురు పేర్లు వచ్చేలా పోస్ట్ చేశారు.
దీంతో ఈ పోస్ట్ ఇపుడు వైరల్ గా మారగా దీనికి తారక్ ఇచ్చిన ఫన్ రిప్లై కూడా ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది.