పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో దర్శకుడు జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్న మోస్ట్అ వైటెడ్ మూవీ “హరిహర వీరమల్లు” గురించి అందరికీ తెలిసిందే. మరి పవన్ నుంచి మొదటి పాన్ ఇండియా సినిమా అలాగే మొదటి వారియర్ రోల్ కూడా ఇదే కావడంతో ఒకప్పుడు పవన్ అభిమానులు ఫుల్ ఎగ్జైట్ అయ్యారు కానీ ఈ సినిమా మొదలై ఇపుడు ఐదేళ్లు దగ్గర అవుతుంది కానీ ఇంకా పూర్తి కాలేదు.
ఇలా పలు వాయిదాలు నూతన తేదీలు తర్వాత ఈ ఏడాది మార్చ్ 28కి లాక్ చేశారు. కానీ ఇక్కడ కూడా అనుమానమే అని పలు రుమార్లు బయటకు వచ్చాయి కానీ ప్రస్తుతం మేకర్స్ మాత్రం అనుకున్న డేట్ లో తీసుకొచ్చేందుకు కాన్ఫిడెంట్ గానే ఉన్నట్టు సమాచారం. సో వీరమల్లు ఆగమనం ఆగేది లేదనే చెప్పొచ్చు.