బాలినేని స్కెచ్ : కూటమి సిగలో మరో కలికితురాయి!

వైయస్ జగన్మోహన్ రెడ్డి కి మామయ్య, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిన్నటి వరకు సీనియర్ నాయకుడిగా ఉండి ప్రస్తుతం జనసేనలో కొనసాగుతున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఎన్డీఏ కూటమి పార్టీల శిxలో మరో కలిjrతురాయrని జతచేయనున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అనేక మునిసిపాలిటీలకు నగర కార్పొరేషన్ లకు, చైర్మన్ డిప్యూటీ వైస్ చైర్మన్ లేదా డిప్యూటీ మేయర్ వంటి పదవులకు సంబంధించి ఎన్నికలు జరుగుతుండగా దాదాపుగా అన్నింటిని కూటమి పార్టీలు సొంతం చేసుకున్నాయి.

ఇలాంటి పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఒకప్పుడు బలమైన నాయకుడిగా ఉండి తర్వాతి పరిణామాలలో జనసేనలో చేరిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి, కూటమి పార్టీలకు తన వంతు కంట్రిబ్యూషన్ ఏమిటి? అనేది నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఒంగోలు మునిసిపాలిటీని కూటమి పరం చేసేందుకు ఆయన పావులు కదుపుతున్నట్లుగా తెలుస్తోంది .

 బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా కూడా సుదీర్ఘకాలం పనిచేశారు. ఆ మేరకు జిల్లావ్యాప్తంగా ఆయనకు వైసీపీలో దగ్గరి పరిచయాలు ఉన్నాయి. అనుచర నాయకులు ఉన్నారు. జిల్లాలోని తన అనుచరులందరినీ కూడా వైసీపీ నుంచి జనసేనలోకి తీసుకు వచ్చేందుకు ఆయన వ్యూహరచన చేస్తున్నట్లుగాను, మంతనాలు సాగిస్తున్నట్లుగాను తెలుస్తోంది.

రాష్ట్రంలో ఇన్ని మునిసిపాలిటీలు చేతులు మారినప్పటికీ జనసేన ఖాతాలో ఒక్కటి కూడా లేదు. ఈ నేపథ్యంలో ఒంగోలు మునిసిపాలిటీని తమ నాయకుడు పవన్ కళ్యాణ్ కు కానుకగా ఇవ్వాలని బాలినేని ఆలోచిస్తున్నట్లుగా సమాచారం. గతంలో మునిసిపల్ ఎన్నికలు జరిగినప్పుడు ఒంగోలు మునిసిపాలిటీలో నూటికి నూరు శాతం వైసీపీ కౌన్సిలర్లు గెలిచారు. అయితే అప్పటికి ఎమ్మెల్యేగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రాపకంతో ప్రోత్సాహంతో కౌన్సిలర్లు అయిన వారే ఎక్కువ. కాబట్టి వారితో తనకున్న సత్సబంధాలను వాడుకుని వారందరినీ కూడా జనసేనలోకి మారేలా చేయడానికి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రయత్నిస్తున్నారని సమాచారం.

తాను జనసేనలో చేరడం వలన ఆ పార్టీకి ఒక గట్టి మేలు తలపెట్టాలని అనుకుంటున్నారు. ఆయన చేరిక సమయంలో ఎలాంటి హడావుడి ఊరేగింపు తదితర వ్యవహారాల లేకుండా చాలా సింపుల్ గా పవన్ సూచన మేరకు పార్టీ కార్యాలయంలో పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. అప్పుడు మిస్ అయిన భారీతనాన్ని తన బల ప్రదర్శనను ఇప్పుడు చూపించాలని బాలినేని అనుకుంటున్నారు. తద్వారా కూటమి  పార్టీల్లో జనసేన ఖాతాలో ఒక మున్సిపల్ చైర్మన్ స్థానం ఉండాలని అనేదే బాలినేని ఆలోచన అనే సన్నిహితులు చెబుతున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories