గతేడాది ‘లక్కీ భాస్కర్’ మూవీతో బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు హీరో దుల్కర్ సల్మాన్. ఇక ఆయన నటిస్తున్న తాజా సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాను డైరెక్టర్ సెల్వమణి సెల్వరాజ్ డైరెక్ట్ చేస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రానున్న ఈ సినిమాలో అందాల భామ భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్‌గా చేస్తోంది.
ఇక ఈ సినిమా నుంచి మేకర్స్ తాజాగా ఓ సాలిడ్ అప్డేట్ అయితే ప్రేక్షకుల ముందుకుతీసుకుని వచ్చారు. ఈ చిత్రానికి ‘కాంత’ అనే ఆసక్తికర టైటిల్‌ను ఫిక్స్ చేసిన మేకర్స్ ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో దుల్కర్ లుక్ సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. ఇక ఈ సినిమాలో ఆయన పాత్ర ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అభిమానుల్లో కలుగుతుంది.
ఈ సినిమా 1950 నేపథ్యంలో సాగనుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ సినిమాలో సముద్రఖని కీలక పాత్రలో నటిస్తున్నారు.