నందమూరి నటసింహం బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం కొద్ది రోజుల క్రితమే పద్మభూషణ్ అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో నందమూరి అభిమానులు ఎంతో సంతోషంతో ఉప్పొంగి పోతున్నారు. ఇక నందమూరి బాలకృష్ణకు సినీ, రాజకీయ ప్రముఖులు తమ శుభాకాంక్షలు తెలియజేశారు.. కాగా, బాలయ్య సోదరి.. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి బాలయ్యకు పద్మభూషణ్ అవార్డు రావడం తో ఓ ప్రత్యేకమైన పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
ఈ సెలబ్రేషన్స్‌లో డైరెక్టర్ అనిల్ రావిపూడి పాల్గొని, కొన్ని ఆసక్తికర కామెంట్లు చేశారు. ఆయన వేదికపై మాట్లాడుతూ.. తాను మూడు వింతైన ఘటనలు చూశానని.. అందులో ఒకటి నారా లోకేష్ తన భార్య ముందే, తల్లి చేసిన వంట బాగుంటుందని చెప్పడం.. బాలయ్యను ఓ ప్రపోజ్ చేయాలని ఆయన భార్య వసుంధర ముందు అడగగా.. ఎవరికి చేయాలని ఆయన అనడం.. ఓ రాష్ట్రానికి సీఎం అయినా కూడా చంద్రబాబు ఆయన సతీమణి కోరిక మేరకు కేవలం 5 నిమిషాల్లోనే స్పీచ్ ముగించడం నిజంగా తనను సర్ప్రైజ్ చేసిందని అనిల్ రావిపూడి అన్నారు.
తాను ఇప్పటివరకు కేవలం నందమూరి హీరోల పవర్ వెండితెరపై చూశానని.. ఇలా నందమూరి ఇంటి మహిళల పవర్‌ను ప్రత్యక్షంగా చూస్తున్నానని ఆయన కామెంట్స్ చేశారు. ఇక ప్రస్తుతం అనిల్ రావిపూడి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.