అక్కినేని యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అక్కినేని నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా , యంగ్ డైరెక్టర్ చందూ మొండేటి తెరకెక్కించిన భారీ సినిమా “తండేల్” గురించి అందరికీ తెలిసిందే. మరి చైతూ కెరీర్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ మూవీ కోసం అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా మేకర్స్ కూడా సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
అయితే ఈ సినిమా బుకింగ్స్ కోసం పాన్ ఇండియా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఇపుడు బుక్ మై షోలో తండేల్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. ఆల్రెడీ నైజాంలో బుకింగ్స్ ఓపెన్ చేయగా వీటికి మంచి రెస్పాన్స్ వస్తున్నట్లు తెలుస్తుంది. మరి ఇప్పుడు వరకు బుక్ మై షోలో 20 వేలకి పైగా టికెట్స్ అమ్ముడుపోగా ఈ సినిమా బుక్ మై షోలో లక్ష 50 వేలకి పైగా ఇంట్రెస్ట్స్ తో ట్రెండింగ్ లో కూడా కొనసాగుతుంది.
మొత్తానికి అయితే తండేల్ సినిమా మంచి ఓపెనింగ్స్ కి రంగం సిద్ధం చేసుకుంటుంది అని సమాచారం. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా ఈ ఫిబ్రవరి 7న పాన్ ఇండియా భాషల్లో విడుదలకి రెడీ అవుతుంది.