మహేష్ సినిమాకి గ్యాప్ ఇచ్చిన ప్రియాంక! టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి – మహేష్ బాబు సినిమాను హాలీవుడ్ స్థాయిలో నిర్మించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరగబోతుంది. ప్రియాంక చోప్రా కూడా ఇందులో నటిస్తోంది.
ఆమె భారీ పారితోషికం తీసుకుంటున్నట్టు సమాచారం. అయితే ఈ సినిమా చిత్రీకరణ నుండి విరామం తీసుకున్న ఆమె, తన సోదరుడు సిద్ధార్థ్ చోప్రా వివాహం కోసం ముంబైకి వెళ్తూ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కనిపించారు. కాగా ప్రియాంక చోప్రా లేకపోయినా, సినిమా చిత్రీకరణ మాత్రం నడుస్తుంది. షెడ్యూల్ యథావిధిగా కొనసాగేలా రాజమౌళి, మహేష్ బాబుతో కూడిన సన్నివేశాలను ప్లాన్ చేశారు. ప్రియాంక అతి త్వరలో తిరిగి వచ్చి షూటింగ్ లో జాయిన్ అవుతుందట.