ఆయన ఏమన్నారంటే!

ఆయన ఏమన్నారంటే! అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా తెరకెక్కుతున్న మూవీ ‘తండేల్’. ఈ సినిమాకి చందూ మొండేటి డైరెక్షన్‌ వహిస్తున్నారు. అయితే, చందూ మొండేటి ఈ సినిమా గురించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాను లవర్స్ రిపీటెడ్‌గా చూడకపోతే తన పేరు మార్చుకుంటానని చందూ మొండేటి ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. 

ఈ మూవీ వాస్తవిక ఘటనల ఆధారంగా తెరకెక్కింది. ఈ నెల 7న థియేటర్లలో విడుదల కాబోతుంది.కాగా ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీం వారియర్ పిక్చర్స్ వారు సొంతం చేసుకొని తమిళంలో గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. మరి తమిళ్ లో ఈ చిత్రం ఎలాంటి ఆదరణ అందుకుంటుందో వేచి చూడాల్సిందే. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories