ఆమె వ్యాఖ్యలు తప్పు అంటున్న ముద్దుగుమ్మ!

ఆమె వ్యాఖ్యలు తప్పు అంటున్న ముద్దుగుమ్మ! బాలీవుడ్ హీరో సైఫ్‌ అలీఖాన్‌ పై దాడి విషయంలో హాట్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా నెగిటివ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆమె క్షమాపణలు కూడా చెప్పింది. ఈ నేపథ్యంలో ఊర్వశీ రౌతేలా మాట్లాడిన తీరును మరో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ తప్పుపట్టారు. 

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రగ్యా జైస్వాల్ ఈ విషయం పై మాట్లాడుతూ.. ‘గొప్ప చిత్రాల్లో భాగమై.. గొప్ప నటీనటులతో కలిసి వర్క్‌ చేస్తున్నప్పుడు కచ్చితంగా గౌరవంగా మాట్లాడాలి. ఎంతో బాధ్యతాయుతంగా ఉండాలి.ఏదైనా మాట్లాడే ముందు ఎంతో జాగ్రత్తగా ఉండాలి’ అని ప్రగ్యా చెప్పుకొచ్చింది.ప్రగ్యా ఇంకా మాట్లాడుతూ.. ‘ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే, ఇతర నటీనటుల పట్ల మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలి. 

ఊర్వశీ లాగా మరీ అంత కఠినంగా ఉండకూడదు. ఏది ఏమైనా ఆమె క్షమాపణలు కూడా చెప్పడం మంచిదైంది. నేను మాత్రం అలాంటి కామెంట్లకి సపోర్ట్‌ చేయను. ఇక ప్రస్తుతం నా సినీ కెరీర్ చాలా బాగుంది. నాకు వరుస విజయాలు వస్తున్నాయి. ఇంకా గొప్ప చిత్రాల్లో నటించాలి’ అంటూ ప్రగ్యా జైస్వాల్ చెప్పుకొచ్చింది.

Related Posts

Comments

spot_img

Recent Stories