ఆయన్ని అలానే పిలుస్తాను! మలయాళ స్టార్ హీరో దిలీప్ కి, హీరోయిన్ కీర్తి సురేశ్ కి మధ్య మంచి అనుబంధం ఉందన్న సంగతి ముందు నుంచి తెలిసిన విషయమే. దీనికి కారణం.. గతంలో దిలీప్ హీరోగా వచ్చిన ఓ మూవీలో అతని కూతురు పాత్రలో కీర్తి సురేష్ నటించినట్లు ఆమె తాజాగా వెల్లడించారు. ఆ సినిమా తర్వాత దిలీప్ కి, హీరోయిన్ కీర్తి సురేశ్ కి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది.
అప్పటి నుంచి ఆయనను కీర్తి సురేష్ అంకుల్ అని పిలిచేదంట. చిన్నతనం నుంచి దిలీప్ ని అలా అంకుల్ అని పిలిచి, ఆ తర్వాత ఆయన పక్కనే హీరోయిన్ గా కీర్తి సురేష్ యాక్ట్ చేసింది.ఇదే విషయం గురించి తాజాగా కీర్తి సురేష్ మాట్లాడుతూ.. ‘కూతురి పాత్ర చేసిన కొన్నేళ్లకు దిలీప్ సరసన గర్ల్ ఫ్రెండ్ రోల్ లో నటించాను. ఆ సమయంలో ఎప్పటిలాగే నేను దిలీప్ ను అంకుల్ పిలిచేదాన్ని. అప్పుడు ఆయనకు అది నచ్చలేదు. అంకుల్ అని కాకుండా అన్నయ్య అని పిలవాలని దిలీప్ చెప్పారు. అప్పటి నుంచి నేను ఆయనను అన్నయ్య అనే పిలుస్తాను’ అని కీర్తి సురేష్ వివరించింది.