సాయి పల్లవి గురించి అంత మాట అన్నాడేంటి!

సాయి పల్లవి గురించి అంత మాట అన్నాడేంటి! నాగచైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో యంగ్‌ అండ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ చందూ మొండేటి తెరకెక్కించిన పాన్‌ ఇండియా మూవీ ‘తండేల్‌’. ఫిబ్రవరి 7న విడుదల కాబోతుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కి ముఖ్య అతిథిగా హాజరైన డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా, సాయి పల్లవి పై చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ.. ‘అర్జున్ రెడ్డి’ మూవీలో హీరోయిన్ కోసం మొదట సాయిపల్లవిని అనుకున్నాను. 

ఓ మలయాళ కోఆర్డినేటర్ తో కూడా మాట్లాడాను’ అని అప్పటి సంగతులు చెప్పాడు సందీప్. సందీప్ ఇంకా మాట్లాడుతూ.. ‘నా సినిమాలో రొమాంటిక్ సీన్స్ ఎక్కువగా ఉంటాయని ఆయనకు చెప్పాను. అంతే అతను వెంటనే.. ‘రొమాంటిక్ సీన్స్ కాదు కదా, సాయి పల్లవి కనీసం స్లీవ్ లెస్ కూడా ధరించదని, ఆమె నీ సినిమా చేయదని, ఆమె గురించి ఆలోచించడం మానుకో’ అని అతను నాకు చెప్పాడు. సహజంగా పెద్ద అవకాశాలు వస్తుంటే హీరోయిన్లు మారిపోతుంటారు. కానీ, సాయి పల్లవి మారలేదు. అప్పటికీ ఇప్పటికీ సాయిపల్లవి ఒకేలా ఉన్నారని సందీప్ రెడ్డి వంగా ఆమెను అభినందించారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Related Posts

Comments

spot_img

Recent Stories