ఆ పాట విన్నాక శోభిత బాధపడింది!

ఆ పాట విన్నాక శోభిత బాధపడింది! అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా తెరకెక్కుతున్నభారీ సినిమా ‘తండేల్’. ఈ సినిమాకి చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ చాలా వేడుకగా జరిగింది. ఈ ఈవెంట్‌ లో నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘తండేల్‌’లోని బుజ్జి తల్లి పాట విడుదలయ్యాక తన భార్య శోభిత ఫీలైందని నాగచైతన్య చెప్పారు. 

తన సతీమణిని బుజ్జితల్లి అని పిలుస్తుంటానని, అందుకే.. ఆ పేరుతో సాంగ్‌ రావడం వల్ల ఆమె ఫీలైందంటూ చైతు నవ్వుతూ చెప్పారు. అనంతరం ఇదే విషయమై దర్శకుడు చందూ మొండేటి మాట్లాడుతూ.. ‘‘నేను చైతు – శోభిత వివాహనికి వెళ్లినప్పుడు.. ‘నా పేరు బుజ్జితల్లి. పాత్ర పేరు వరకూ ఒకే. పాట కూడా పాడేసి పెట్టేశారా’ అంటూ శోభిత నన్ను అడిగిందని’ చందూ చెప్పారు. 

శ్రీకాకుళం జిల్లా డి. మత్స్యలేశం గ్రామానికి చెందిన పలువురు మత్స్యకారులు పాకిస్థాన్‌ కోస్ట్‌గార్డ్‌కు చిక్కి జైలు శిక్ష అనుభవించిన ఘటన ఆధారంగా ఈ సినిమాని రూపొందించారు.దేశభక్తి అంశాలతోపాటు ఓ ప్రేమకథనూ చెప్పబోతున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories