ఓహో రత్తమ్మ’ అంటున్న లైలా! మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న తాజా సినిమా ‘లైలా’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలను పెంచింది. ఈ సినిమాలో విశ్వక్ తొలిసారి ఓ లేడీ గెటప్‌లో నటిస్తుండటంతో సినీ ప్రేమికుల్లో సైతం ఈ మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి.
ఇక ఈ మూవీపై అంచనాలను పెంచేస్తూ ఈ చిత్ర పోస్టర్స్, సాంగ్స్, టీజర్.. ఇలా అన్ని ఆకట్టుకునేలా ఉన్నాయి. అయితే, ఇప్పుడు ఈ సినిమాలోని ఓ మాస్ సాంగ్‌ను తాజాగా ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు మూవీ మేకర్స్. ‘ఓహో రత్తమ్మ’ అంటూ సాగే ఈ మాస్ ఫోక్ సాంగ్‌ను పెంచల్ దాస్ రచించి ఆలపించారు.
ఆయనతో పాటు మధుప్రియ కూడా ఈ సాంగ్ పాడింది. ఇక ఈ పాటకు లియోన్ జేమ్స్ అందించిన మాస్ బీట్స్ పక్కా డ్యాన్స్ నెంబర్‌గా ఈ పాటను నిలిపింది. కాగా ఈ పాటలో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్న ‘కోయ్.. కోయ్..’ అనే ట్రాక్ కూడా వాడారు. దీంతో సోషల్ మీడియాలో ఈ సాంగ్‌కు అదిరిపోయే రెస్పాన్స్ రావడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.ఈ సినిమాలో ఆకాంక్ష శర్మ హీరోయిన్గా నటిస్తోంది.