మళ్లీ పాత పద్దతే!

మళ్లీ పాత పద్దతే! గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన తాజా సినిమా “గేమ్ ఛేంజర్” గురించి అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ మూవీ వాటిని అందుకోవడంలో కొంతమేర విఫలం అయ్యింది. అయితే ఈ సినిమా తర్వాత ఇక అన్ని అంచనాలు దర్శకుడు బుచ్చిబాబు సానాతో చేస్తున్న భారీ చిత్రం పైనే ఏర్పడ్డాయి. 

చరణ్ కెరీర్లో 16వ సినిమాగా దీనిని తెరకెక్కిస్తుండగా ఈ సినిమాకి రంగస్థలం, దేవర, రోబో సినిమాటోగ్రఫర్ రత్నవేలు పని చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఒక కీలక సన్నివేశం కోసం తాను మళ్ళీ పాత పద్దతిలో షూట్ చేయబోతున్నట్టుగా తెలిపారు. అప్పట్లో సినిమాలు ఇప్పుడు తరహాలో షూటింగ్ చేసేవారు కాదని తెలిసిందే. అప్పట్లో సినిమాలు నెగిటివ్ రీల్స్ ద్వారా షూట్ చేసేవారు. 

మరి కాల క్రమేణా ఇది అంతరించి మొత్తం డిజిటల్ అయిపోయింది. మరి ఈ పాత పద్ధతినే మళ్ళీ చరణ్ సినిమాలో ఒక పర్టిక్యులర్ సీన్ కోసం తీసుకురాబోతున్నట్లుగా తెలిపారు. మొత్తం సీన్ ని ఇలానే తీయడం కష్టం అని అందుకే ఆ కీలక సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్నట్టుగా తెలిపారు.

Related Posts

Comments

spot_img

Recent Stories