విశాఖ ఉక్కు: దుష్ప్రచారాలకు శాశ్వత అడ్డుకట్ట!

విశాఖ ఉక్కు కోసం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎంతగా తపన పడిందో ప్లాంట్ ను సందర్శించిన కేంద్ర మంత్రి కుమారస్వామి మాటల్లో స్పష్టంగా తెలిసి వచ్చింది. ఆయన సూటిగా జరిగిన విషయాలను నివేదించడం కూటమి ప్రభుత్వం గౌరవాన్ని పెంచే విధంగా ఉంది. విశాఖ ఉక్కు కర్మాగారానికి ప్యాకేజీ సాధించడంలో రాష్ట్ర ఐటీ మంత్రి లోకేష్ ప్రయత్నం ఎంతో ఉందని ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి అభినందించారు.

ఈ పరిశ్రమను  కాపాడేందుకు లోకేష్ చాలా తపన పడ్డారని, తన తండ్రి రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ అంటూ దానిని నెరవేర్చేందుకు సహకరించాలని లోకేష్ అనేక పర్యాయాలు విజ్ఞప్తి చేశారని.. కుమారస్వామి వెల్లడించారు. చంద్రబాబును డైనమిక్ సీఎంగా అభివర్ణించారు. విశాఖ ఉక్కు ను కాపాడడం వెనుక ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషిని కూడా కుమారస్వామి ప్రస్తావించారు. పవన్ కళ్యాణ్ కూడా గత ప్రభుత్వ కాలంలో ఆందోళన చేస్తున్న కార్మికుల శిబిరం వద్దకు వెళ్లి వారితో కూర్చుని మరీ.. కేంద్రంలోని పెద్దలతో మాట్లాడి అయినా సరే ప్రైవేటీకరణను ఆపు చేయిస్తానని అప్పట్లోనే హామీ ఇచ్చిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది.

దానికి తగ్గట్లుగానే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుకరించబోయేది లేదని, పునర్నిర్మిస్తామని మంత్రి కుమారస్వామి తేల్చి చెప్పారు. ఈ విషయాన్ని గత ఏడాది జూలైలోనే ప్రస్తావించిన సంగతి కూడా ఆయన గుర్తు చేశారు. సాక్షాత్తు కేంద్ర మంత్రి గతంలో చెప్పినప్పటికీ విశాఖ ఉక్కుపై వైసీపీ నాయకులు ఇన్నాళ్లపాటు రకరకాల డ్రామాలు నడిపించిన సంగతి ప్రజలకు గుర్తుండే ఉంటుంది. తాజాగా విశాఖకు వచ్చిన కుమారస్వామి ప్లాంటును పరిశీలించాక అధికారులు, ఉక్కు కార్మిక సంఘ ప్రతినిధులతో విడివిడిగా సమావేశం అయ్యారు. ఈ పరిశ్రమ చరిత్ర చాలా పెద్దదని ఒడిదుడుకులను చక్కదిద్ది గాడిలో పెడతామని ప్లాంటుకు అవసరమైన గనుల. ప్రత్యామ్నాయం కూడా పరిశీలిస్తున్నట్లు చెప్పారు.

మొత్తానికి కేంద్రమంత్రి స్పష్టమైన హామీ ఇవ్వడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దుష్ప్రచారానికి చెంప దెబ్బ కొట్టినట్లు అయింది. ఇన్నాళ్లుగా కూటమి ప్రభుత్వాన్ని నిందించడానికి విశాఖ ఉక్కు ఆస్త్రాన్ని కూడా వైసిపి నాయకులు వాడుతూ వచ్చారు. గత జులైలో కుమారస్వామి వచ్చి ప్రెవేటీకరణ ఉండదని చెప్పి వెళ్లిన తర్వాత కూడా వైసీపీ నాటకాలు అలాగే కొనసాగాయి. తాము ప్రభుత్వంలో ఉండగా, విశాఖ ఉక్కు గురించి నామమాత్రంగా కూడా పట్టించుకోని జగన్ దళాలు.. ఇప్పుడు నానా అబద్ధపు మాటలతో ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేశాయి. అయితే వారి దురాలోచనలకు ఇవాళ మంత్రి ప్రకటనతో అడ్డుకట్టపడిందని ప్రజలను నమ్ముతున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories