గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు ప్రకటించింది.ఈ క్రమంలో సినీ పరిశ్రమకు అందించిన సేవలకు గాను నందమూరి బాలకృష్ణను పద్మ భూషణ్ అవార్డుకు ఎంపిక చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ క్రమంలో బాలయ్య, సీనియర్ ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని అన్నారు. బాలయ్య ఏం అన్నారంటే…. ‘నాకు పద్మభూషణ్ పురస్కారం దక్కడం చాలా సంతోషంగా ఉంది. కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. దీన్ని బిరుదుగా కంటే బాధ్యతగా భావిస్తున్నాను’ అని బాలయ్య అన్నారు.
బాలయ్య ఇంకా మాట్లాడుతూ.. ‘ఎన్టీఆర్ తనయుడిగా పుట్టడం నా అదృష్టం. ఆయనకు భారతరత్న ఇవ్వాలని కోరుతున్నాను. ఇది తెలుగు ప్రజలందరి కోరిక. ఉమ్మడి ఏపీ మాజీ సీఎంగా, దివంగత నటుడిగా ఎన్టీఆర్ ఎన్నో సేవలు అందించారు. అలాంటి మహనీయుడికి ‘భారతరత్న’ ఇవ్వాలి’ అని బాలయ్య బాబు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అన్నట్టు బాలకృష్ణతో పాటు తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్, మాజీ హీరోయిన్ శోభన కి కూడా పద్మ భూషణ్ అవార్డులకు ఎంపిక చేసింది కేంద్ర ప్రభుత్వం.