ప్రస్తుతం టాలీవుడ్లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ సినిమాల్లో జక్కన్న , సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న SSMB29 మూవీపై అంచనాలను వేరే లెవెల్లో ఉన్నాయి. ఇక ఈ సినిమాను రీసెంట్గా అధికారికంగా చాలా సింపుల్‌గా లాంచ్ చేశారు. దీంతో ఈ సినిమా నుంచి ఎప్పుడు ఎలాంటి అప్డేట్ వస్తుందా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ క్రమంలో ఈ భారీ సినిమాని రాజమౌళి తనదైన విజన్‌తో చాలా వేగంగా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ షెడ్యూల్స్‌ను చాలా స్పీడ్‌గా పూర్తిచేసేలా ఆయన ప్రణాళికలు సిద్దం చేస్తున్నడంట. దీనిలో భాగంగా హీరో మహేష్ బాబుతో పాటు మిగతా యూనిట్ కూడా ఈ షెడ్యూల్స్ స్పీడ్‌గా పూర్తయ్యేలా చూడాలని రాజమౌళి చెప్పాడంట.
ఇక ఈ సినిమాలో హీరోయిన్గా ప్రియాంక చోప్రా ఫిక్స్ అయ్యిందని తెలుస్తోంది. ఇప్పటికే ఆమె హైదరాబాద్‌కు చేరుకోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరుతుంది.