పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా సినిమాల్లో డైరెక్టర్ సుజిత్ తో చేస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా “ఓజి” కూడా ఒకటి. ఈ సినిమాపై ఉన్న అంచనాలే వేరు కాగా ఈ సినిమా ఎప్పుఫెప్పుడు వస్తుందా అని అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ హైప్ లోనే ఆల్రెడీ భారీ బిజినెస్ ని ఈ సినిమా చేస్తుండగా ఓవర్సీస్ మార్కెట్ లో కూడా ఈ మూవీ చేస్తుంది.
ఇలా తాజాగా సినిమా జర్మనీ డీల్ అయితే పూర్తి చేసుకుంది. మరి సినిమాని జర్మనీలో 3 రీలమ్స్ ఎంటర్టైన్మెంట్స్ వారు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. వీరు గతంలో కల్కి 2898 ఎడి, పుష్ప 2 రీసెంట్ గా డాకు మహారాజ్ సినిమాల్ని డిస్ట్రిబ్యూట్ చేశారు.