అసలు నిజం ఏంటంటే! టాలీవుడ్ దగ్గర ఉన్నటువంటి టాప్ డైరెక్టర్స్ లో తన తాజా సినిమా పుష్ప 2 తో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయిన డైరెక్టర్ సుకుమార్ కూడా ఒకరు. అయితే తన కెరీర్ లో చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికీ తన క్రియేటివ్ నెస్ తో పాటుగా తన వింటేజ్ మార్క్ ని కూడా ఎక్కడా వదలకుండా ఇపుడు సినిమాలు చేస్తూ ఉంటాడు సుకుమార్. ఇదిలా ఉండగా టాలీవుడ్ లో ఆకస్మికంగా జరుగుతున్న ఐటీ దాడులు గురించి తెలిసిందే. దిల్ రాజు అలాగే మైత్రి మూవీ మేకర్స్ సహా చాలా మంది ప్రముఖులు ఇళ్లల్లో నిన్నటి నుంచి పెద్ద ఎత్తున సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో నేడు దర్శకుడు సుకుమార్ పై కూడా ఐటీ సోదాలు జరుగుతున్నట్టుగా ఇపుడు వార్తలు బయటకి వచ్చాయి. అయితే సుకుమార్ పై కూడా ఐటీ విచారణ జరగడం అనేది ఈరోజు కాదు నిన్ననే మొదలైనట్టుగా తెలుస్తుంది. సో ఇవాలే ఫ్రెష్ గా అవుతుంది అనేది నిజం కాదు అనేది నిజం కాదని చెప్పాలి. అలాగే పుష్ప 2 వసూళ్ల విషయంలోనే నిర్మాతలతో కలిపే అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇలా ప్రస్తుతం అయితే వారి ఆర్ధిక లావాదేవీలు విషయంలో ఆరాలు తీస్తున్నట్టుగా సమాచారం.