పచ్చ డబ్బు మాత్రం పుష్కలంగా కావాలి!

తెలుగుదేశం పార్టీ క్రియాశీల సభ్యత్వాలు కోటి బెంచ్ మార్కును దాటాయి. దేశంలోనే ప్రాంతీయ పార్టీల చరిత్రలో ఇది ఒక రికార్డు. తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాత నాలుగున్నర దశాబ్దాల సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నడూ కోటి సభ్యత్వాలు నమోదు కావడం అనేది జరగలేదు. ఆ రకంగా కూడా ఇది ఒక గొప్ప రికార్డు. ఈ రికార్డును ఖచ్చితంగా ఆ పార్టీ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంది. తెలుగుదేశం పార్టీలోని సీనియర్ నాయకుడు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈ ఘన విజయం సందర్భంగా.. దినపత్రికలలో భారీ ప్రకటనలు ఇచ్చారు. తెలుగుదేశం అంటే ఇంత ఎత్తున ఎగిరి పడుతూ ఉండే సాక్షి దినపత్రిక ఆ ప్రకటనను మాత్రం లడ్డూ లాగా పుచ్చుకొని ప్రచురించింది. రాజకీయం రాజకీయమే- వ్యాపారం వ్యాపారమే అని ఎవరైనా సమర్ధించవచ్చు గాక! ఆ పాయింట్ నిజమే కానీ సాక్షి దినపత్రిక చేసే రాజకీయ వ్యాపారం ఎలా ఉంటుందో దిగజారుడుతనానికి ఒక నిదర్శనం లాగా అది ఎలా సాగుతూ ఉంటుందో మాత్రం కచ్చితంగా చర్చించుకోవాలి!

వ్యాపారం వ్యాపారమే అనే మాట నిజమే తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెసుకు శత్రువు అయినంత మాత్రాన వారు ఇచ్చే ప్రకటనలను తన పత్రికలో ప్రచురించకుండా ఉండాలని ఏం లేదు. కానీ సాక్షి పత్రిక ఎలాంటిది అంటే ఎన్నికల సమయంలో వారి వ్యాపారం ఒక తీరుగా ఉంటుంది. ఎన్నికల సమయంలో తెలుగుదేశం గాని జనసేన గాని ఆ పార్టీలకు చెందిన అభ్యర్థులు ప్రకటనలు ఇస్తే సాక్షి దినపత్రికలో వేయరు. ఆ ప్రకటనలను తీసుకోరు. రిజెక్ట్ చేస్తారు. పెయిడ్ ఆర్టికల్స్ అనే ముసుగులో అభ్యర్థుల నుంచి లక్షల రూపాయల దందా వసూలు చేసి వారికి అనుకూల వార్తలను ప్రచురించే వైనం కూడా తెలుగు రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు. సాక్షి దినపత్రికలో అలాంటి దందా కూడా కేవలం వైసీపీ అభ్యర్థులకు మాత్రమే పరిమితం.

ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్థులకు మినహాయింపు ఏమీ ఉండదు. వారి పార్టీ గనుక వారికి సహకరించేదేమీ ఉండదు. వారి నుంచి కూడా ఇబ్బందిగా పెయిడ్ ఆర్టికల్స్ సొమ్ము తీసుకుని మాత్రమే వారి వార్తలు ప్రచురిస్తుంటారు. అదే సమయంలో ప్రత్యర్థి పార్టీలకు చెందిన వారి నుంచి పెయిడ్ ఆర్టికల్స్ రూపేణా సాక్షిలో ప్రచారం కోరుకుంటే కొన్ని సందర్భాలలో వీటికోసం ప్రత్యర్థి పార్టీల నుంచి భారీ ఆఫర్లు వచ్చినప్పుడు ముందు సొమ్ము తీసేసుకుని ఆఫీసుకు వెళ్లి ఆ తరువాత సొమ్ము తిరిగి ఇచ్చి రిజెక్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ప్రత్యేకంగా తెలుగుదేశం, జనసేన పార్టీలకు సంబంధించి ఎలాంటి కించిత్తు ప్రచారం కూడా తమ పత్రికలో కనిపించడానికి వీల్లేదు.. అని వారు ఫిక్స్ అయినట్లుగా భావించాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి తెలుగుదేశం కోటి క్రియాశీల సభ్యత్వాల మేలు రాయి దాటిందనే అపురూపమైన ఘట్టాన్ని ప్రస్తుత జాకెట్ యాడ్ వేయడానికి సాక్షి దినపత్రికకు మనసెలా ఒప్పిందో?

సాక్షి లోగో కు ఒకవైపున వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరోవైపున ఎన్టీ రామారావు బొమ్మ ఉండే పరిస్థితిని ఈ ప్రకటన రూపంలో తప్ప చరిత్రలో మరొక సందర్భంలో జరుగుతుందని తెలుగు ప్రజల అసలు ఊహించగలరా? సాక్షి తమ రాజకీయ ప్రయోజనాలు, భావజాలాన్ని పక్కకు పెట్టి ఈ ప్రకటన ఎందుకు తీసుకున్నట్టు? కేవలం డబ్బు మీద ఆశతో మాత్రమేనా ఇతరత్రా రాజకీయ సిద్ధాంత బలం వారికి లేదా? అనేది అందరికీ కలుగుతున్న సందేహం. ఎన్నికలు లేవ గనుక ఇప్పుడు తెలుగుదేశాన్ని కీర్తించే ప్రకటనలు తమ పత్రికలో ప్రచురితమైన వచ్చే నష్టమేమీ లేదని వారు అనుకుంటున్నారేమో తెలియదు. అలాగే ఒకవేళ అలా కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా మళ్ళీ లేచి నిలదొక్కుకోవడం సాధ్యం కాదు గనుక కనీసం సాక్షి ద్వారా వ్యాపారమైనా సవ్యంగా సాగిద్దాం అనే ఉద్దేశంతో ప్రత్యర్థుల ప్రకటనలను కూడా స్వీకరిస్తున్నారేమో తెలియదు. మొత్తానికి సాక్షి దినపత్రిక జాకెట్టు యాడ్ గా ప్రచురితమైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రచురించిన ప్రకటన రాజకీయ వర్గాలలో కొత్త చర్చకు దారితీస్తుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories