టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన కెరీర్‌లోని 29వ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్.రాజమౌళి డైరెక్షన్ లో రూపొందిస్తున్నాడు. ఈ సినిమాను ప్రకటించినప్పటి నుంచి దగ్గర్నుండి ఈ మూవీపై అంచనాలు పీక్స్‌లో ఏర్పడ్డాయి. ఈ మూవీని పాన్ వరల్డ్ మూవీగా డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించబోతున్నారు.
ఇక ఈ సినిమాలో మహేష్ సరికొత్త లుక్‌తో ప్రేక్షకులను థ్రిల్ చేయనున్నట్లు తెలుస్తుంది.అయితే, ఈ సినిమాపై మ్యూజిక్ డైరెక్టర్ థమన్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన థమన్ హాలీవుడ్‌కు జేమ్స్ బాండ్.. టాలీవుడ్‌కి మహేష్ బాబు అంటూ ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాడు.
ఇక ఈ సినిమా వెయ్యి కోట్ల వసూళ్లు అలవోకగా చేస్తుందని.. బాక్సాఫీస్ లెక్కలు ఎవరూ ఊహించని విధంగా ఉంటాయని థమన్ చెప్పుకొచ్చాడు. ఇలా SSMB29 మూవీపై థమన్ చేసిన కామెంట్స్ అభిమానుల్లో ఈ సినిమాపై బజ్‌ను అమాంతం పెంచేసింది.