టాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్ కాంబోలో నందమూరి బాలకృష్ణ, మాస్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను కాంబో కూడా ఒకటని గ్యారంటీగా చెప్పుకొవచ్చు. వీరి కాంబోలో వచ్చిన చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్స్‌గా నిలిచాయి. ఇక వీరి కాంబోలో వచ్చిన ‘అఖండ’ ఎలాంటి విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే.
ఇప్పుడు ఈ కాంబోలో తెరకెక్కుతున్న ‘అఖండ-2 తాండవం’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే, తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ఓ సాలిడ్ అప్డేట్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు. ‘అఖండ 2’ చిత్ర షూటింగ్ మొదలయ్యిందని.. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే మహాకుంభ మేళాలో ఈ చిత్ర షూటింగ్‌ను ప్రారంభించినట్లుగా చిత్ర యూనిట్ చెప్పింది.
ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభ మేళాలో యాక్షన్ మొదలైందని ఓ సరికొత్త పోస్టర్ ద్వారా మేకర్స్ విడుదల చేశారు. ఇక ఈ సినిమాలో బాలయ్య మరోసారి పవర్‌ఫుల్ అఘోరి పాత్రలో దుమ్ములేపేందుకు రెడీ అవుతున్నారు.