ప్రముఖ నటి మాజీ పోర్న్ స్టార్ సన్నీ లియోన్ గురించి అందరికీ తెలిసిందే. అయితే ఇపుడు ఈమె పలు సినిమాలు చేస్తుండగా తాను చేస్తున్న తాజా మూవీనే “త్రిముఖ”. ఇందులో సన్నీ లియోన్ సరసన నూతన హీరో యోగేష్ కల్లే నటించబోతున్నాడు. నటుడు యోగేష్ కల్లే పాన్-ఇండియా మూవీ “త్రిముఖ”తో పరిచయం అవుతున్నాడు.
ఈ మూవీ మెయిన్ షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు సమాచారం. మార్చి 2025లో విడుదల అవుతుంది.“త్రిముఖ”తో పాటు, ఈ యంగ్ హీరో “చాణుక్యం” , “బెజవాడ బాయ్స్” అనే మరో రెండు సినిమాలకు సంతకం చేశారు. హెబ్బా పటేల్ కథానాయికగా నటిస్తున్న “చాణుక్యం” చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.