‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’ కోసం నెటిజన్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూడో పార్ట్ పై కొత్త అప్ డేట్ వినపడుతుంది. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ దాదాపుగా పూర్తి అయిందని.. అవుట్ ఫుట్ అద్భుతంగా ఉందని సమాచారం. మొత్తానికి ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సీరీస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించుకుంది. ఇప్పటివరకు వచ్చిన ఈ సిరీస్ రెండు సీజన్లు సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే ఈ సిరీస్ మూడో సీజన్ కోసం ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగిందని సమాచారం. ఇక ఈ మూడో పార్ట్ పై మనోజ్ బాజ్పేయీ రీసెంట్ గా ఓ క్లారిటీ ఇచ్చారు. ‘త్వరలో సరికొత్తగా ఈ ఫ్యామిలీ మ్యాన్ మీ ముందుకు రాబోతున్నాడ’’ని ఆయన వివరించారు. ఈ మూడో సీజన్ లో దేశభక్తుడైన గూఢచార పోలీసు అధికారి శ్రీకాంత్ తివారీగా మనోజ్ బాజ్పేయీ కనపడబోతున్నారు.