దటీజ్ ప్రశాంత్ వర్మ! ఈ ఏడాది సంక్రాంతి కానుకగా పలు సినిమాలు అలరించేందుకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మరి ఈ సంక్రాంతి సినిమాలతో గతేడాది సినిమాలు వచ్చి కూడా ఏడాది పూర్తయ్యింది.
అయితే గత సంక్రాంతికి వచ్చి భారీ విజయాన్ని అందుకున్న సినిమాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జా హీరోగా, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబోలో వచ్చిన తెలుగు సినిమా మొట్ట మొదటి సూపర్ హీరో మూవీ “హను మాన్”. గతేడాది సాలిడ్ హైప్ నడుమ వచ్చిన ఈ సినిమా ఒక ఊహించని విజయాన్ని అందుకుని సంక్రాంతి సినిమాల్లో చరిత్ర సృష్టించింది. అయితే ఈ సినిమా సక్సెస్ ఆ సినిమా దర్శకుడు ప్రశాంత్ వర్మకి హీరోకి ఎంతో ప్రత్యేకంగా నిలిచిన సంగతి తెలిసిందే.
మరి ఈ ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రశాంత్ వర్మ మరో ఇంట్రెస్టింగ్ విషయాన్ని పంచుకున్నాడు. హను మాన్ సినిమా తన గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంది అని అలాంటి సినిమాకి ఇపుడు ఏడాది పూర్తయ్యింది. మరి ఎమోషన్ ని తనతో జీవితాంతం ఉండేలా ఒక చిహ్నం వేయించుకున్నాను అంటూ తన చేతికి హనుమంతుని గదాదండం ప్రతీకని పచ్చ బొట్టు ని షేర్ చేసుకున్నాడు. దీంతో ఈ పోస్ట్ ఇపుడు వైరల్ గా మారింది.