చరణ్ సినిమా పై ఉపాసన ట్వీట్! గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఈ సినిమాను డైరెక్టర్ శంకర్ పూర్తి పొలిటికల్ డ్రామాగా తెరకెక్కించగా చరణ్ తన సాలిడ్ పర్ఫార్మెన్స్తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాడు.
ఇక ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌తో మేకర్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. అయితే, ‘గేమ్ ఛేంజర్’ మూవీకి వస్తున్న రెస్పాన్స్‌పై రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల తాజాగా సోషల్ మీడియాలో ఓ ట్వీట్ చేసి అభిమానులతో పంచుకున్నారు. ‘గేమ్ ఛేంజర్’ మూవీ కి వస్తున్న రెస్పాన్స్ అద్భుతంగా ఉందని.. రామ్ చరణ్‌కు శుభాకాంక్షలు చెబుతున్నట్లు ఆమె పేర్కొన్నారు.
ఇక ప్రతి విషయంలోనూ రామ్ చరణ్ నిజమైన ‘గేమ్ ఛేంజర్’ అని ఆమె తన ట్వీట్లో చెప్పుకొచ్చారు ఇలా తన భర్త సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌పై ఉపాసన ట్వీట్ చేయడంతో ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ‘గేమ్ ఛేంజర్’ మూవీలో రామ్ చరణ్ తన యాక్టింగ్‌తో ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాడు.