మామూలు విధ్వంసం కాదిది!

మామూలు విధ్వంసం కాదిది! గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలయ్య బాబు నటించిన తాజా సినిమా ‘డాకు మహారాజ్’ ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలను క్రియేట్ చేసింది. డైరెక్టర్‌ బాబీ కొల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్యూర్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తీశారు. 

ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్లకు సాలిడ్ రెస్పాన్స్ దొరికింది. మరో రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ విడుదలకు సిద్దం అవుతున్న ఈ సినిమా నుంచి విడుదల ట్రైలర్‌ను తాజాగా ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు. గతంలో విడుదలైన థియేట్రికల్ ట్రైలర్‌లో బాలయ్య నుంచి డైలాగ్స్ లేకపోవడంతో అభిమానులు నిరాశ చెందారు. 

వారికి అదిరిపోయే ట్రీట్ అందిస్తూ ఈ విడుదల ట్రైలర్‌ను కట్ చేశారు మేకర్స్. బాలయ్య చెబుతున్న ఒక్కో డైలాగ్ అభిమానులకు గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. ఇక ఆయన చేయబోయే విధ్వంసం ఏ రేంజ్‌లో ఉండబోతుందో మనకు ఈ ట్రైలర్ కట్‌లో చూపించేశారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories