సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలెడతా!

సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలెడతా! నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా సినిమా ‘డాకు మహారాజ్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు పెంచేసింది. డైరెక్టర్‌ బాబీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో బాలయ్య పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నాడు. 

ఈ సినిమా నుంచి రిలీజ్ ట్రైలర్‌ను తాజాగా లాంచ్ చేశారు మేకర్స్. దీనికి సంబంధించిన ఈవెంట్‌లో బాలకృష్ణ కొన్ని సాలిడ్ స్టేట్మెంట్స్ విడుదల చేశారు. ‘డాకు మహారాజ్’ మూవీ అందరికీ నచ్చేలా తీశామని ఆయన చెప్పారు. ఇక ‘అఖండ 2’ షూటింగ్‌ను మొదలుపెట్టామని.. ఇకపై తన రెండో ఇన్నింగ్స్ ని అభిమానులకు చూపిస్తానని బాలయ్య తెలిపారు. 

‘అఖండ 2’ తర్వాత తానేంటో అందరికీ చూపిస్తానని.. రెండో ఇన్నింగ్స్ అంటే స్టార్‌డమ్ తగ్గాక మొదలుపెట్టేది కాదు అని … ఆ విషయం తనకు వర్తించదని బాలయ్య చెప్పారు. ఏదేమైనా ‘డాకు మహారాజ్’ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకునే కథాంశంతో తెరకెక్కిందని.. ఈ సినిమాతో బాలకృష్ణ మరోసారి తనదైన మార్క్ వేయడం ఖాయమని మేకర్స్ అంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories