మిక్స్‌డ్ టాక్ తో నడుస్తున్న గేమ్‌ఛేంజర్‌!

శంకర్ సినిమాలకు ఒక బ్రాండ్ ఉంటుంది. ఒక థీమ్ ఉంటుంది. ఎన్ని సినిమాలు వచ్చినా అదే కథాంశంగా ఉంటాయనే టాక్‌ ఎప్పటి నుంచో నడుస్తుంది. ఇప్పుడు గేమ్ ఛేంజర్ కూడా అలానే ఉంది అంటున్నారుఅభిమానులు. మొదటి ఆట ముగిశాక రామ్ చరణ్ నటించిన ఈ సినిమాకు మిక్స్‌డ్‌ టాక్ వచ్చింది. శంకర్ అన్ని సినిమాల్లానే ఇది కూడా ఉందని కొందరు అంటుంటే..బావుందని మరి కొందరు అంటున్నారు.

భారీ అంచనాల మధ్య గేమ్ ఛేంజర్ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఏపీలో రాత్రి ఒంటి గంట షో పడింది. తెలంగాణలో తెల్లవారు జామున నాలుగు గంటల ఆట తో సినిమా విడుదల అయ్యింది. అయితే సినిమా ఎలా ఉన్నా రామ్ చరణ్‌కు మాత్రం ఫుల్ మార్కులు పడుతున్నాయి.

కానీ శంకర్ మేకింగ్ మాత్రం బాలేదని అంటున్నారు. ఇంతకు ముందు ఆయన సినిమాల్లా లేదని అంటున్నారు. పాటలు మాత్రం వినడానికి, పిక్చరైజేషన్ అద్భుతంగా ఉందని టాక్‌ . ఇందులో కూడా రా మచ్చా మచ్చా పాట సూపర్‌‌గా ఉందని అంటున్నారు. ఫస్టాఫ్ మొత్తం కమర్షియల్‌గా యావరేజ్‌గా ఉందని..కొన్ని ఐఏఎస్ బ్లాక్‌లు మాత్రం బావున్నాయని టాక్‌ నడుస్తుంది.

ఇంటర్వెల్ బ్యాంగ్ బావుందని అక్కడి నుంచి సినిమా ఊపందుకుంటుందని చెప్పారు. చరణ్, కియారాల మధ్య లవ్ స్టోరీ ఏం బాలేదని..సినిమాకు అదే మైనస్ అవ్వొచ్చని అభిమానులు చెబుతున్నారు. తమన్ సంగీతం సినిమాకు పెద్ద బలం అంటున్నారు. తమన్‌ బీజీఎం అదిరిపోయిది. సెకండాఫ్‌ పై హైప్‌ పెంచేలా ఇంటర్వెల్‌ సీన్‌ ఉందని తెలుస్తుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories