కర్ణాటక బుకింగ్స్‌ కూడా మొదలయ్యాయి!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన తాజా మోస్ట్‌  అవైటెడ్ మూవీ “గేమ్ ఛేంజర్”. మావెరిక్ డైరెక్టర్‌ శంకర్ తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా సినిమాపై మంచి హైప్ నెలకొనగా ఈ సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాస్ట్ ని మొదటగా ఈ సినిమానే మొదలు పెడుతుంది. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా బుకింగ్స్ ని ఒక్కో భాషలో విడుదల చేస్తూ వస్తున్నారు.

ఇలా తాజాగా కన్నడ వెర్షన్ లో బుకింగ్స్ ని మొదలు పెట్టినట్లుగా మేకర్స్ తేల్చి చెప్పారు. ఆల్రెడీ బెంగళూరులో కొన్ని ప్రాంతాల్లో ముందే బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. కానీ ఇపుడు ఫుల్ ఫ్లెడ్జ్ గా కర్ణాటకలో బుకింగ్స్ ఓపెన్ అయ్యినట్టుగా సమాచారం. మరి అక్కడ ఈ సినిమాకి ఎలాంటి ఓపెనింగ్స్ వస్తాయో చూడాల్సిందే.

Related Posts

Comments

spot_img

Recent Stories