నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ , శ్రద్దా శ్రీనాథ్ ఇంకా తెలుగు యువ హీరోయిన్ చాందిని చౌదరిలు ముఖ్య పాత్రల్లో దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కించిన సాలిడ్ యాక్షన్ మూవీ “డాకు మహారాజ్” గురించి తెలిసిన విషయమే. బాలయ్య కెరీర్ లో 109వ సినిమాగా తెరకెక్కించిన ఈ మూవీ పై హైప్ ఓ రేంజ్ లో ఉంది. ఇక ఈ సినిమా గురించి అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఇపుడు ఫైనల్ గా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ పై ఓ క్లారిటీ ఇచ్చారు మేకర్స్.
దీంతో డాకు మహారాజ్ సినిమా ప్రీ రిలీజ్ ని ఈ జనవరి 9న సాయంత్రం 6 గంటల నుంచి అనంతపురంలో శ్రీనగర్ కాలనీ దగ్గర చేస్తున్నట్టుగా వేదికని చెప్పేశారు. అలాగే ఈ ఈవెంట్ కి బాలయ్య అల్లుడు, ఏపీ మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా వస్తున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. మరో ఈ ఈవెంట్ లో ఎలాంటి హైలైట్స్ ఉంటాయో చూడాల్సిందే.