పాటతోనే మొదలు!

శ్యామ్ సింగ రాయ్ ఫేమ్ ‘రాహుల్ సంకృత్యాన్’ డైరెక్షన్‌ లో విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఘాట్ ఫిబ్రవరి మొదటి వారం నుంచి మొదలు కానుందని, మొదటి షెడ్యూల్ లో విజయ్ పై ఓ సాంగ్ ను ఘాట్ చేస్తారని సమాచారం. ఈ పాట కోసం  రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్ కూడా వేసేందుకు సిద్దమయ్యారంట.

ఈ సాంగ్ ఘాట్ అనంతరం హీరో పై ఓ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేస్తారని సమాచారం. ఈ సీక్వెన్స్ కోసం రాహుల్ సంకృత్యాన్ హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో కొన్ని లొకేషన్స్ ను కూడా ఎంపిక చేస్తున్నట్లు సమాచారం.ఇక, ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పూర్తిగా సరికొత్త గెటప్ లో కనిపిస్తాడని.. ముఖ్యంగా విజయ్ లుక్ చాలా కొత్తగా ఉంటుందని.. అలాగే, 1854-78 మధ్య కాలంలో జరిగే కథ కాబట్టి, సినిమాలో చాలా కొత్త కొత్త వేరియేషన్లు ఉంటాయని తెలుస్తుంది.

పైగా ఆర్నాల్డ్ వోస్లూ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వినపడుతున్నాయి. మరి నిజంగానే ఆయన ఈ సినిమాలో నటిస్తే కచ్చితంగా ఈ సినిమాకి కలిసి వస్తుంది. ఎంతైనా ‘రాహుల్ సంకృత్యాన్’ డైరెక్షన్‌లో నాని హీరోగా వచ్చిన శ్యామ్ సింగ రాయ్ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories