పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా సినిమాల్లో డైరెక్టర్ జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా “హరిహర వీరమల్లు” కూడా ఒకటి. మరి పవన్ నుంచి ఇదే మొదటి పాన్ ఇండియా సినిమా కావడంతో అప్పట్లో భారీ హైప్ దీనిపై నెలకొంది
. కానీ అలా ఆలస్యం అవుతూ వస్తుండడంతో దీని హైప్ ని ఓజి తీసుకుంది. ఇక సినిమా నుంచి అప్డేట్స్ కొన్నే వచ్చాయి కానీ రీసెంట్ గానే పవన్ పాడిన పాటని మేకర్స్ జనవరి 6న రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. సీన్ కట్ చేస్తే ఇపుడు ఆ సాంగ్ రావట్లేదు అంటూ షాకిచ్చారు.
మరి పవన్ కళ్యాణ్ ఆలపించిన ఈ సాంగ్ వినాలని చాలా మంది ఎదురు చూసారు కానీ ఇపుడు మేకర్స్ సాంగ్ ని విడుదల చేయడం ఆలస్యం అవుతుంది అంటూ ఇచ్చిన అప్డేట్ పవన్ అభిమానులని నిరాశ పరిచింది.