పెట్టుబడులకు స్వర్గధామంగా మారుతున్న ఏపీ!

నారా చంద్రబాబునాయుడు పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామంగా మారుతున్నదని నమ్మడానికి ఇది మరొక రుజువు. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ రాష్ట్రంలో గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ, పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు నిర్ణయించింది. దశలవారీగా దాదాపు రూ.95 వేల కోట్లతో ఈ ప్రాజెక్టు మీద పెట్టుబడులు పెట్టబోతున్నారు. తొలిదశలో ప్రీప్రాజెక్టు పనులను 6100 కోట్ల రూపాయలతో తక్షణం చేపట్టడానికి బీపీసీఎల్ బోర్డు ఆమోదం కూడా తెలియజేసింది. ఏపీకి రానున్న పెట్టుబడుల్లో ఇది కూడా ఒక అతిపెద్ద పెట్టుబడిగా భావించాలి.
జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రంలో పెట్టుబడులు అనేవి కనుమరుగు అయిపోయాయి. ఒక్క సంస్థ అయినా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి ముందుకు రాలేదు. ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్న వారు కూడా యూనిట్లు పెట్టలేదు. వైసీపీ నాయకుల దందాలు, అక్రమాలు, వాటాల పేరుతో చేస్తున్న దందాలకు జడిసి మిన్నకుండిపోయారు. నిజం చెప్పాలంటే రాష్ట్రంలో అప్పటికే యూనిట్లు ప్రారంభించే ప్రయత్నంలో ఉన్న పెట్టుబడిదారులు, పారిశ్రామిక వేత్తలు కూడా ఇతర రాష్ట్రాలకు తరలిపోయారు. అలాంటిది చంద్రబాబు పరిపాలన మొదలు కాగానే.. పెట్టుబడిదారులు రాష్ట్రానికి రప్పించడం మీదనే ప్రధానంగా దృష్టి పెట్టారు. ఆ ఫలితంగానే ఇప్పుడు బీపీసీఎల్ కూడా రానుంది.

బీపీసీఎల్ రిఫైనరీ రామాయపట్నం సమీపంలో రానున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. తొలుత ఈ రిఫైనరీని బందరుకు తీసుకురావాలని ఎంపీ బాలశౌరి  ప్రయత్నించారు. మచిలీపట్నం అనువైన ప్రాంతం అని, అవసరమైన భూములు కూడా ఇస్తామని చంద్రబాబు కూడా హామీ ఇచ్చారు. అయితే తొలుత సానుకూలత చూపించిన బీపీసీఎల్ సంస్థ అధికారులు, చివరికి రామాయపట్నం మేలు అనే నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఎక్కడ ఉన్నా సరే.. ఇంత పెద్ద భారీ ప్రాజెక్టు రాష్ట్రానికి వస్తే చాలు అనే ఉద్దేశంతో ఉన్న చంద్రబాబునాయుడు ప్రభుత్వం తక్షణం ఓకే చెప్పేసింది.

ఈ రిఫైనరీకి సంబంధించి ప్రీప్రాజెక్టు పనులను 6100 కోట్ల రూపాయలతో ప్రారంభించినట్టుగా సంస్థ ప్రకటించింది. బోర్డు మీటింగ్ లో చేసిన నిర్ణయాన్ని స్టాక్ ఎక్స్చేంజీకి కూడా సమాచారం ఇచ్చేశారు. రిఫైనరీతోపాటు పెట్రో కెమికల్ కాంప్లెక్స్ కూడా ఏర్పాటు కానుంది. దేశంలో బీపీసీఎల్ కు ఇప్పటికి మూడు చోట్ల మాత్రమే రిఫైనరీలు ఉన్నాయి. ముంబాయి, కొచ్చి, మధ్యప్రదేశ్ లోని బినాల్ లో ఉన్నాయి. నాలుగోది రామాయపట్నం వద్ద ఏర్పాటుకానుంది. ఈ ప్రాజెక్టు వస్తే ఆ ప్రాంత రూపురేఖలే మారిపోతాయని ప్రజల్లో ఆశలు వ్యక్తం అవుతున్నాయి. 

Related Posts

Comments

spot_img

Recent Stories