మరోసారి దొరికేశారోచ్‌!

టాలీవుడ్‌ రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ, నేషనల్‌ క్రష్‌ రష్మిక ప్రేమలో ఉన్నారనే ప్రచారం ఎప్పటి నుంచో వినపడతున్న మాటే. కానీ తమ ప్రేమ వ్యవహారం గురించి ఇప్పటి వరకు ఇద్దరిలో ఎవరూ ఓపెన్ అవ్వకపోయినప్పటికీ.. వారిని చూసిన వారంతా ఫిక్సయిపోయారు. తాజాగా రష్మిక.. తాను సినీ ఇండస్ట్రీకి చెందిన ఓ వ్యక్తితో రిలేషన్ లో ఉన్నట్లు పరోక్షంగా చెప్పుకొచ్చింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ.. రష్మికతో లవ్ లో ఉన్నట్లు వస్తున్న వార్తలపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు కూడా.సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు తానే చెబుతానంటూ తెలిపారు. అపరిమితమైన ప్రేమ అనేది ఉందో, లేదో తనకు తెలియదంటూ రొమాంటిక్‌ గా చెప్పుకొచ్చాడు.

అందులో 2025లో పెళ్లి చేసుకుంటావా అంటే చేసుకోను అని చెబుతున్న ఓ వీడియోను సోషల్‌ మీడియాలో పెట్టాడు కూడా. అలా వచ్చే ఏడాది కూడా తాను పెళ్లి చేసుకునేది లేదంటూ చెప్పేశాడు.దీంతో రష్మిక, విజయ్ వివాహం ఎప్పుడు చేసుకుంటోరనని అంతా అనుకుంటున్నారు. అదే సమయంలో తాజాగా విజయ్, రష్మిక.. ఎయిర్ పోర్ట్ లో మరోసారి కెమెరాల కంటికి చిక్కారు. ముంబై విమానాశ్రయంలో సోమవారం రాత్రి మెరిశారు. ముందుగా రష్మిక.. ఎయిర్ పోర్ట్ కు వచ్చారు. ఆ సమయంలో కెమెరాకు పోజులిచ్చారు. అక్కడే ఉన్న అభిమానులు ఆమెతో పిక్స్ దిగారు.

ఆ తర్వాత విజయ్ కూడా అభిమానులతో ఫొటోలకు పోజులిచ్చారు. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అయితే క్రిస్మస్, న్యూ ఇయర్ ఫెస్టివల్స్ వస్తున్న విషయం తెలిసిందే. దీంతో విజయ్, రష్మిక వాటిని సెలబ్రేట్ చేసుకోవడానికి వెళ్తున్నారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇద్దరూ తమ షూటింగ్స్ నుంచి విరామం తీసుకుని.. విదేశాలకు వెళ్తున్నారని సమాచారం. న్యూ ఇయర్ తర్వాత తిరిగి ఇండియా రానున్నట్లు తెలుస్తోంది.

Previous article
Next article

Related Posts

Comments

spot_img

Recent Stories