జగన్ చెప్పే సింగిల్ డిజిట్ ఆయనకే ప్రాప్తిస్తుందా?

మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. తనకు ఖాళీ దొరికినప్పుడు పార్టీ ఒక్కో జిల్లా నాయకులను పిలిచి మీటింగు పెట్టుకుని.. ఎన్నికల ప్రచారం నాటినుంచి చెప్పిన సంగతులే చెబుతూ కాలం గడుపుతూ ఉంటారు. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా సరే.. వైఎస్సార్ కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని ఆయన కలలు కంటూఉంటారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం మీద విముఖత వచ్చేసిందని.. ఇప్పుడు ఎన్నికలు జరిగితే.. ఆ కూటమి సీట్లు సింగిల్ డిజిట్ కు పడిపోతాయని ఆయన ఎక్స్‌ట్రాలు మాట్లాడుతూ ఉంటారు. అయితే చూడబోతే.. ఎన్నికలు వచ్చే అవసరం కూడా ఏర్పడేలా లేదు. ఆలోగానే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల బలం సింగిల్ డిజిట్ కు పడిపోయే ప్రమాదం ఉన్నట్టుగా కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ గేట్లు తెరిస్తే చాలు.. వైసీపీ నుంచి పలువురు ఎమ్మెల్యేలు ఫిరాయించి తమలో చేరడానికి ఉవ్విళ్లూరుతున్నారంటూ.. మంత్రి రాంప్రసాద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇలాంటి అభిప్రాయం కలిగిస్తున్నాయి.

నిజం చెప్పాలంటే.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికల ఫలితాల్లోనే సింగిల్ డిజిట్ కు పరిమితం అయ్యే ప్రమాదాన్ని తృటిలో తప్పించుకున్నారు. గత అయిదేళ్లపాటూ 151 సీట్లు తమకు దక్కాయంటూ.. తెలుగుదేశాన్ని నానా రకాలుగా ఎద్దేవా చేస్తూ విర్రవీగిన జగన్మోహన్ రెడ్డికి ఫలితాలు వెలువడుతున్న సమయంలో ముచ్చెమటలు పట్టాయి. ఒక దశలో 9 స్థానాల వద్ద వైసీపీ పరిమితం అవుతుందని అంతా అనుకున్నారు. అయితే.. చచ్చీ చెడీ మరో రెండు స్థానాలు గెలిచారు. మొత్తానికి 11 దగ్గర వారి పతనం స్థిరపడింది.
ఆనాటినుంచి ఎప్పుడు ప్రెస్ మీట్లు పెట్టినా.. ప్రభుత్వం ప్రజలకు నమ్మకం పోయింది. ఇప్పుడు ఎన్నికలు పెట్టినా మేమే గెలుస్తాం. జమిలి కారణంగా ముందస్తు ఎన్నికలు వస్తాయి. ఎన్డీయే సింగిల్ డిజిట్ కు పడిపోతుంది అని చెప్పుకుంటూ ఆయన గడుపుతున్నారు.

అయితే మంత్రి రాంప్రసాద్ రెడ్డి తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని చెబుతున్నారు. తెలుగుదేశం తలుపులు తెరిస్తే వైసీపీ ఖాళీ అవడం ఖాయం అని చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ సత్తా ఏమిటో నీటి సంఘాల ఎన్నికల్లో తేలిందని కూడా అంటున్నారు. రాంప్రసాద్ రెడ్డి మాటల్లో ఇంకో ట్విస్టు ఏంటంటే.. కడప జిల్లాలో కూడా వైసీపీ ఖాళీ అవుతుందని  చెప్పడం.
ఇప్పటికే మాజీలు పలువురు వైసీపీని వీడి తెలుగుదేశం, జనసేన తీర్థం పుచ్చుకుంటున్నారు. ఆ పార్టీలు గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. జగన్ ను నమ్ముకున్నందుకు అసెంబ్లీకి వెళ్లే యోగ్యత కూడా లేకుండా బతుకుతున్న ఎమ్మెల్యేలు ఫిరాయించడం గ్యారంటీ అని పలువురు విశ్లేషిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories