అదానీ జగన్ లంచాలపై కోర్టుకువెళ్లనున్న షర్మిల!

సెకితో సోలార్ విద్యుత్తు సరఫరా ఒప్పందాలు కుదుర్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి తాను ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో 1750 కోట్ల రూపాయల లంచాలు తీసుకున్న సంగతి ఇంకా చర్చల్లో వేడివేడిగానే నడుస్తోంది. ఆ లంచాల వ్యవహారంతో పాటు ఈలోగా జగన్ చుట్టూ అనేక వివాదాలు ముసురుకుంటున్నాయి. ఆ ఒప్ంపదాల్లో అసలు లంచాలతో సంబంధమే లేదని, ఒప్పందం కేవలం కేంద్ర ప్ర;భుత్వ సంస్థతో చేసుకున్నాం అని జగన్ దళాలు అన్నీ తమను సమర్థించుకుంటున్నాయి. అయితే.. మరొకవైపు ఏది ఏమైనా సరే.. అంత భారీ లంచాలతో రాష్ట్ర ఖజానా మీద దాదాపు లక్షన్నర కోట్ల భారం వేసిన ఒప్పందాలను తక్షణం రద్దు చేయాలనే డిమాండ్లు కూడా బలంగా వినిపిస్తున్నాయి. తాజాగా ఈ విషయంలో కోర్టును ఆశ్రయించి.. కోర్టు ద్వారా ఒప్పందాలను రద్దుచేయించేందుకు, జగన్ మీద విచారణ జరిగేలా ప్రభుత్వాన్ని ఆదేశించేందుకు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పూనిక వహించబోతున్నట్టుగా తెలుస్తోంది.

అదానీ ముడుపుల వ్యవహారం కేవలం తెలుగురాష్ట్రాలను మాత్రమే కాదు. యావత్ దేశాన్ని ఏ స్థాయిలో కుదిపివేసిందో అందరికీ తెలుసు. అప్పట్లో అదానీ నుంచి లంచాలు పుచ్చుకుని అయిదు రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకితో ఒప్పందాలు చేసుున్నాయనేది అమెరికాలోని ఎఫ్‌బిఐ తేల్చిన సంగతి. అయితే ఈ అయిదు రాష్ట్రాలకు కలిపి 2000 కోట్లకు పైగా లంచాలు ఇవ్వగా, ఒక్క జగన్ కు మాత్రమే 1750 కోట్లు ఇచ్చారని తేల్చారు. జగన్ ఒక్కడే.. ఏకంగా ఏడువేల మెగావాట్ల విద్యుత్తు కొనగోలుకు అతిభారీ ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనిద్వారా రాష్ట్రం మీద లక్షన్నర కోట్ల భారం పడుతుందని అంచనా వేశారు.
జగన్ లంచాల తీరు మీద విడివిడిగా కేసులు కూడా నమోదు అయ్యాయి. అయితే కేవలం కేసులతో సరిపెట్టకుండా.. ముందుగా అదానీతో కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేయాలనే డిమాండ్ పలువర్గాల నుంచి వినిపిస్తోంది. రద్దు చేయడం అంటే.. పెట్టుబడిదారుల్లో విశ్వాసం సన్నగిల్లుతుంది గనుక.. తక్షణం ఒప్పందాల రద్దు నిర్ణయం తీసుకోకుండా ఆచితూచి వ్యవహరించాలని నారా చంద్రబాబునాయుడు ప్రభుత్వం భావిస్తోంది.

ఇవన్నీ ఇలా సాగుతుండగా.. ఈ విషయంలో జగన్ భరతం పట్టేదాకా చెల్లెలు షర్మిల ఊరుకునేలా లేరు. చంద్రబాబునాయుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారో తెలియడం లేదని, ప్రజల శ్రేయస్సు కోసం కాంగ్రెస్ కోర్టును ఆశ్రయిస్తుందని ఆమె అంటున్నారు. అదే జరిగితే.. ఇప్పటికే తన మీద ఉన్న అనేక అక్రమార్జనలు, అవినీతి కేసులకు తోడు ఈ లంచాల కేసులో కూడా జగన్ కోర్టుకు తిరుగుతూ ఉండాల్సి వస్తుందని పలువురు అంచనా వేస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories